ఎల్‌జీబీటీ వర్గానికి ఆయుష్మాన్ ఖురానా చేయూత
on Jun 7, 2023

నటీనటులు అన్నాక ఎప్పుడూ సొసైటీ నుంచి తీసుకోవడమే కాదు. తిరిగి ఇచ్చేయాలని అన్నారు ఆయుష్మాన్ ఖురానా. తాను చేయదగ్గ సాయం ఏం ఉన్నా సరే, చేయడానికి తానెప్పుడూ సిద్ధంగానే ఉంటానని చెప్పారు. శుభ్‌మంగళ్ జ్యాదా సావధాన్ హీరో లేటెస్ట్ గా చేసిన ఓ పని అభిమానులను గర్వపడేలా చేస్తోంది. నువ్వు రియల్ హీరో బాస్ అంటూ తమ ఆనందాన్ని చాటుతున్నారు ఫ్యాన్స్ చండీఘర్ ప్రాంతంలోని ఎల్‌జీబీటీలకోసం కృషి చేస్తున్నారు ఆయుష్మాన్ ఖురానా. లేటెస్ట్ గా వారి కోసం అక్కడ ఫుడ్ ట్రక్స్ కట్టించారు. ఫుడ్ బిజినెస్‌తో స్వయం ఉపాధిని వారు పొందవచ్చన్నది ఆయుష్మాన్ ఖురానా ఆలోచన.
ఫుడ్ ట్రక్స్ కి ఆయన స్వీకార్ అని పేరు పెట్టారు. ఇవాళ్టి సొసైటీలో వారికోసం ఏదో ఒకటి చేయడానికి ప్రజలు ముందుకు రావాలి. ఇది నావంతు సాయం అని అంటారు ఆయుష్మాన్. ఆయుష్మాన్ మాట్లాడుతూ ``నా ఆలోచనల ప్రకారం నటీనటులకు సోషల్ రెస్పాన్సుబులిటీ ఉండాలి. ప్రజల ఆశీస్సుల వల్లే ఇప్పుడున్న స్థానం దక్కింది నాకు. అందుకే వాళ్లకు ఏమైనా చేయాల్సినప్పుడు తడుముకోకుండా చేసేస్తుంటాను. మరీ ముఖ్యంగా అన్నీ సార్లు నేనే చేయలేకపోవచ్చు. నా తోటివారికి అవగాహన కల్పించడానికి నా ఫేమ్ పనికొస్తుంది. నేను చేయడంతో పాటు, చేతనైన వారు సమాజానికి ఏదో ఒకటి చేసేలా మార్గం చూపించాలని తాపత్రయపడుతుంటాను. ఒకరితోఒకరు చేతులు కలపడం వల్ల గట్టి పునాది పడుతుందన్నది నా భావన. భిన్నత్వంలో ఏకత్వం మనది. ఐకమత్యమే మహాబలం అని మన పూర్వీకులు చెబుతుంటారు. ఇప్పటికే నేను దాన్ని నమ్ముతాను. కలిసి అడుగేస్తే కొండలను సైతం పిండి చేయగల సత్తామనకుంది. ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీకి చేతనైనంత చేయాలనుకున్నాను. నా వంతు చేశాను`` అని అన్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



